: గవర్నర్ కార్యదర్శిగా హర్ ప్రీత్ సింగ్ నియామకం
తెలంగాణలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగానే కాక పలు కీలక పోస్టుల్లో సమర్థవంతంగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి హర్ ప్రీత్ సింగ్ ను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కార్యదర్శిగా నియమించింది. ఇక మరో సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ నదీంను కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం వీరిద్దరి బదిలీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.