: రెయిన్ గన్ అంటే మనుషుల్ని చంపే తుపాకీ కాదు: సభలో చంద్రబాబు కామెంట్


ఏపీ అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబునాయుడు విపక్షంపై ఈ రోజు మాటల దాడి చేశారు. పట్టిసీమ, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి హామీ పథకం తదితరాలపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలపైనా వరుసగా సెటైర్లు సంధించారు. ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన రెయిన్ గన్లనూ ప్రస్తావించిన చంద్రబాబు వాటినే ఆస్త్రంగా చేసుకుని జగన్ పై దాడి చేశారు. రెయిన్ గన్ అంటే, మనుషుల్ని చంపే తుపాకీ కాదని పేర్కొన్న చంద్రబాబు... ‘‘రెయిన్ గన్ పెట్టి పంటల్ని కూడా చంపుతున్నారు’’ అని జగన్ అంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News