: వైసీపీకి భవిష్యవాణి వినిపించిన ఆనం వివేకా!
సెటైరికల్ ఆరోపణలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, ప్రస్తుతం టీడీపీలో ఉన్న నేత ఆనం వివేకానందరెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆనం... ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి భవిష్యవాణి వినిపించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలను ప్రస్తావించిన ఆనం... భవిష్యత్తులో వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మాత్రమే మిగులుతారని వ్యాఖ్యానించారు. దశలవారీగా వైసీపీలోని మిగిలిన నేతలంతా టీడీపీ గూటికి చేరుతారని కూడా ఆయన జోస్యం చెప్పారు.