: ఈజిప్ట్ కు చెందిన ఇబ్రహీమే హైజాకర్!... డిమాండ్లే తెలియాల్సి ఉంది!


ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసిన వ్యక్తి ఎవరన్న విషయం తెలిసిపోయింది. ఈజిప్ట్ కు చెందిన ఇబ్రహీం సమాహా అనే వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక సమాహా బందీలుగా ఉన్న ప్రయాణికులంతా విదేశీయులేనట. అతడు ఎందుకు విమానాన్ని హైజాక్ చేశాడన్న విషయం మాత్రం తెలియరాలేదు. అయితే తన డిమాండ్లు నెరవేరే దాకా బందీలను విడిచిపెట్టేది లేదని అతడు చెబుతున్నట్లు సమాచారం. ఈలోగా సైన్యం తనను బంధించేందుకు యత్నిస్తే... విమానాన్ని పేల్చేస్తానని అతడు బెదిరిస్తున్నాడు. దీంతో అతడి డిమాండ్లేమిటన్న విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News