: తులసిరెడ్డిపై హత్యాయత్నంతో నాకు సంబంధం లేదు: భూమా నాగిరెడ్డి
కొత్తపల్లి సర్పంచ్ తులసిరెడ్డిపై జరిగిన హత్యాయత్నంతో తనకుగానీ, తన అనుచరులకు గానీ ఎలాంటి సంబంధం లేదని తెలుగుదేశం నేత భూమా నాగిరెడ్డి వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాను దూరమని అన్నారు. పాత కక్షలతో ఎవరో దాడికి పాల్పడి వుండవచ్చని, వారెవరో విచారణలో తేలుతుందని అన్నారు. అభివృద్ధిని కాంక్షించే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని, తనపై పాత వైరంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.