: మరోమారు సుప్రీం గడప తొక్కిన రోజా... హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్


వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోమారు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కారు. తనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రోజా ఇప్పటికే ఓ మారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. సుప్రీం ఆదేశాలతో స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ రోజా సస్పెన్షన్ ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్... సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీనిపై వెనువెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావించిన రోజా... గత వారం సెలవుల నేపథ్యంలో కాస్తంత ఆలస్యంగా కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ముందుకు తనను పిలవకపోవడం దారుణమని సదరు పిటిషన్ లో రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సమస్యలపై పోరాడుతున్నందునే తనను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారని కూడా ఆమె ఆరోపించారు.

  • Loading...

More Telugu News