: శ్రీదేవి కోసం ట్రై చేశాము, మా అదృష్టం కొద్దీ ఆమె ఒప్పుకోలేదు: ‘బాహుబలి’ కథా రచయిత


‘బాహుబలి’ చిత్రంలో శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవి కోసం ట్రై చేశాము, అయితే మా అదృష్టం కొద్దీ ఆమె ఒప్పుకోలేదు. శివగామి పాత్రలో రమ్యకృష్ణ చాలా బాగా చేసింది’ అని ‘బాహుబలి’ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ‘బాహుబలి’ జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా ఒక టీవీ ఛానెల్ లో విజయేంద్రప్రసాద్ మాట్లాడారు. ‘బాహుబలిని’ కట్టప్ప ఎందుకు చంపేశాడనేది ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి అందరినోళ్లలో నానుతున్న ప్రశ్న అని.. అసలు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడని విజయేంద్ర ప్రసాద్ ని ప్రశ్నించగా... ఆయన స్పందిస్తూ, ‘దీనిపై చాలా మంది రకరకాలుగా అనుకుంటున్నారు. కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ గారిని కూడా ఇదే ప్రశ్న అడిగితే, ఈ విషయం చెబితే డైరెక్టర్ నన్ను చంపేస్తారని ఆయన సమాధానం చెప్పాడు. ఇదే ప్రశ్న డైరెక్టర్ రాజమౌళిని అడిగితే, 'డైరెక్టర్ గా చంపమన్నాను కనుక కట్టప్ప చంపేశాడ'ని సమాధానం చెప్పాడు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న నన్ను అడిగితే, బాహుబలి చచ్చిపోయాడని ఎందుకనుకుంటున్నారని రచయితగా నేను అడుగుతాను’ అని విజయేంద్ర ప్రసాద్ సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News