: కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది: వెంకయ్యనాయుడు
ఉత్తరాఖండ్ లో తమ ప్రభుత్వం పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ మొసలికన్నీరు కారుస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ట్విట్టర్లో కాంగ్రెస్ పై మండిపడ్డ ఆయన ఉత్తరాఖండ్ వివాదానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ బేరసారాలాడుతూ కెమెరా కంటికి చిక్కారని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీలు అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ 91 సార్లు ప్రభుత్వాలను గద్దెదించిందని చెప్పిన ఆయన, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన ట్విటర్లో పెట్టారు. కాగా, హరీష్ రావత్ పై స్టింగ్ ఆపరేషన్ చేసిన రెబల్ ఎమ్మెల్యేలు వాటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే.