: మాల్యా బ‌ల‌వంతంగానైనా విచార‌ణ ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది: జైట్లీ


బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగవేసి దేశం వీడిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు విజయ్‌మాల్యా ఉదంతంపై కేంద్ర ఆర్థిక శాఖ‌మంత్రి అరుణ్‌జైట్లీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. మాల్యా గౌరవప్రదంగా బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లించాలని అన్నారు. లేకపోతే బలవంతంగానైనా విచారణ సంస్థల నుంచి చర్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. విజయ్‌మాల్యా సంస్థల్లాంటి పెద్ద సంస్థల విషయంలో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందన్నారు. గౌరవప్రదంగా బ్యాంకులకు చెల్లించాల్సిన బ‌కాయిలు చెల్లిస్తే బాగుంటుందన్నారు. కాగా, విదేశాల‌కు చేరుకున్న అనంత‌రం మాల్యా.. భారత్‌కు వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదంటూ ది సండే గార్డియన్ అనే పత్రికకు ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.900 కోట్ల రుణానికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఇంత‌కుముందే మాల్యాకు సమన్లు జారీ చేసింది. ఈనెల 18 (శుక్రవారం)న‌ ముంబైలోని తమ కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. కానీ, మాల్యా విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. తాజాగా, విజయ్‌మాల్యా బ్యాంకులకు బకాయిలు పడ్డ మొత్తాల్ని ఆయన నిజాయతీగా కడితే బాగుంటుందని, లేకపోతే న్యాయపరంగా బ్యాంకులకు వచ్చే అధికారాల ద్వారా వారు ఏమైనా చేస్తారని వాటిని మాల్యా ఎదుర్కోవలసి ఉంటుందని అరుణ్‌జైట్లీ హెచ్చ‌రించారు.

  • Loading...

More Telugu News