: శ్రీజ పెళ్లి వేడుకలో అల్లు ఫ్యామిలీ సందడి
మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ పెళ్లి వేడుకలో అల్లు ఫ్యామిలీ సందడి చేసింది. పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన సంగీత్‌లో అల్లు కుటుంబం సందడి చేసినట్లు అల్లు శిరీష్ సామాజిక మాద్యమం ద్వారా తెలిపారు. అల్లు కుటుంబ సభ్యలందరూ కలిసి దిగిన సెల్ఫీని అల్లు శిరీష్ పోస్ట్ చేశారు. 'శ్రీజ సంగీత్‌లో అల్లు ఫ్యామిలీ' అంటూ ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరయినట్లు సమాచారం. ఇక రిసెప్షన్ హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేశారు. మార్చి 31న గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. వివాహ విందుకు పలు రంగాలకు చెందిన ముఖ్యమైన వారిని ఆహ్వానించి, గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.