: ఎస్సై రాత పరీక్ష తేదీలో మార్పులేదు
తెలంగాణలో ఎస్సై పరీక్ష నిర్వహణ తేదీలో మార్పులేమీ ఉండబోవని అధికారులు ప్రకటించారు. ఎస్సై రాత పరీక్షను ఏప్రిల్ 17న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక గతంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కానిస్టేబుళ్ల రాత పరీక్షను ఏప్రిల్ 24న నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 3న నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే ఆర్‌ఆర్‌బీ పరీక్షల దృష్ట్యా కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శనివారం అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షను ఏప్రిల్ 24న నిర్వహించనున్నట్లు ప్రకటించారు.