: ఆఫ్గన్ పార్లమెంటు భవనంపై రాకెట్లతో దాడి చేసిన ఉగ్రవాదులు!


ఆఫ్గన్ రాజధాని కాబూల్ లో ఇండియా నిర్మించిన పార్లమెంటు భవంతిపై కొద్ది సేపటి క్రితం ఉగ్రవాదులు రాకెట్ దాడి చేశారు. ఈ భవనాన్ని గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ దాడిలో జరిగిన ప్రాణనష్టం గురించిన సమాచారం ఇంకా తెలియరాలేదు. తేలికపాటి రాకెట్ ను సమీపం నుంచి పార్లమెంటు మీదికి తాలిబాన్ ఉగ్రవాదులు ప్రయోగించినట్టు తెలుస్తోంది. పార్లమెంటును చుట్టుముట్టిన ఆఫ్గన్ భద్రతా దళాలు, మరో దాడి జరగకుండా చర్యలు చేపట్టాయి. సైన్యం ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతోంది.

  • Loading...

More Telugu News