: ధీరూభాయ్‌ అంబానీకి ప్రకటించిన పద్మ పురస్కారాన్ని అందుకున్న కోకిలాబెన్


న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్య‌క్ర‌మం అట్టహాసంగా జ‌రుగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేస్తున్నారు. దివంగత ధీరూభాయ్‌ అంబానీకి ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ఆయన సతీమణి కోకిలాబెన్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో 5 పద్మ విభూషణ్‌, 8 పద్మ భూషణ్‌, 43 పద్మశ్రీ అవార్డులను ప్ర‌దానం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, కేంద్రమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News