: బాధలేదు... అత్యుత్తమ క్రికెటర్ చేతిలో ఓడిపోయాం: ఆస్ట్రేలియా
ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ గా ఎదిగిన విరాట్ కోహ్లీ చేతిలో తాము ఓడిపోయామని, అందుకు బాధపడటం లేదని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఓ విభిన్న స్థాయి ఇన్నింగ్స్ ఆడాడని, అతని ప్రతిభను మాటల్లో వర్ణించలేనని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా జట్టు నంబర్ వన్ క్రికెటింగ్ జీనియస్ చేతిలో ఓటమి పాలైందని, ఇది వన్ మ్యాన్ షో అని అన్నాడు. కాగా, నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ భారత జట్టును వరల్డ్ కప్ టీ-20 పోటీల్లో సెమీ ఫైనల్స్ కు చేర్చిన సంగతి తెలిసిందే.