: గల్లీల్లో సైతం ఉపయోగించేందుకు ఫైర్ బైక్‌లను ఏర్పాటు చేశాం: నాయిని
తెలంగాణ శాసన సభా సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, అగ్నిమాపక శాఖ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు. తెలంగాణ వచ్చాక 4 కొత్త అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ విషయమై బడ్జెట్లో రూ.61కోట్ల 81లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. గల్లీల్లో సైతం ఉపయోగించేందుకు ఫైర్ బైక్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 91 అగ్నిమాపక కేంద్రాలున్నాయన్నారు. మరో 46 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల పెంపునకు సంబంధించి బిల్లును ఈరోజు సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నెలకు రూ.25వేలు తగ్గకుండా పింఛన్ ఇచ్చేలా చూడాలని బిల్లులో ప్రతిపాదన చేయనున్నారు.