: 'నేను సచ్చిపోతున్నా' అంటూ కేటీఆర్ కు వాట్సప్ మెసేజ్
"మంత్రి కేటీఆర్ గారూ... సిరిసిల్లలో మార్వాడీ సేట్లు బాధిస్తున్నారు. అందరు వ్యాపారుల ముందే అజ్ భాయ్ కొట్టాడు. నేను వ్యాపారంలో నష్టపోయా. అప్పు తీర్చేస్తానని చెప్పినా వినలేదు. చనిపోదామని రెండుసార్లు ప్రయత్నించి కూడా, భార్యా పిల్లలు గుర్తుకు వచ్చి ఆగిపోయా. నెలకు రూ. 1.20 లక్షలు నష్టపోతున్నా. ఇక నేను సచ్చిపోతున్నా. నా ఆత్మహత్య తరువాతైనా మీరు చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నా. నా భార్యా పిల్లలకు న్యాయం చేయండి" అంటూ సిరిసిల్లకు చెందిన ఓ చిరు వ్యాపారి తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు వాట్సాప్ లో బహిరంగ వాయిస్ మెసేజ్ పెట్టాడు. దీంతో స్పందించిన కేటీఆర్, ఆ వ్యక్తిని పిలిచి కౌన్సెలింగ్ చేయాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది.