: మిమ్మల్ని సంతృప్తిపరుస్తాం... కూర్చోండి: వైకాపాతో కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు వాదోపవాదాల మధ్య ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభానికి ముందే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు, వారికి మేలు కలిగించేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించాలని వైకాపా వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్ కోడెల ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టగానే వైకాపా సభ్యులు పోడియంలోకి వచ్చి తమ తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో కోడెల "ప్లీజ్ కూర్చోండి. యూ విల్ బీ శాటిస్ ఫైడ్ (మిమ్మల్ని సంతృప్తిపరుస్తాం). మీ తీర్మానంపై సమయం వచ్చినప్పుడు చెబుతాను. బీఏసీలో మీరే అంగీకరించారు. ఇప్పుడిదేంటి? ప్లీజ్... దయచేసి కూర్చోండి. ఈ విషయంలో అందరమూ సీరియస్ గానే ఉన్నాము. కానీ రావాల్సిన పద్ధతిలో రావాలి. యూ కెనాట్ డిక్టేట్ ది చైర్. సహకరించండి. మీరు ఒప్పుకున్న నియమాన్ని మీరే ఉల్లంఘిస్తే ఎలాగండీ?" అని ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.