: డీఎండీకే అధినేత విజయ్ కాంత్ భార్యపై కేసు నమోదు


డీఎండీకే అధినేత విజయ్ కాంత్ భార్య, మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలతపై కేసు నమోదైంది. ఓటర్లను డబ్బులు తీసుకోవాలని ఆమె ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగసభలో ప్రేమలత మాట్లాడుతూ, కొన్ని పార్టీలు ఓటుకు రూ.2 నుంచి రూ.3 వేలు చొప్పున ఇస్తున్నారని, అలాంటి వారిని ఓటుకు లక్ష రూపాయలు ఇవ్వమని అడగండంటూ ఓటర్లకు ఆమె చెప్పారు. దీంతో తిరునెల్వేలికి చెందిన అన్నాడీఎంకే నేతలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News