: దర్శకుడు ఎన్నిసార్లు చెయ్యమని చెబితే అన్నిసార్లు చేస్తాను: సందీప్ కిషన్
ఏదైనా ఒక సన్నివేశానికి సంబంధించి దర్శకుడు ఎన్నిసార్లు టేక్ చెబితే అన్నిసార్లు చేస్తానని ప్రముఖ సినీ నటుడు సందీప్ కిషన్ అన్నాడు. తాను యాక్టు చేసిన తర్వాత ఇక ఆ సీన్ ఎట్లా వచ్చిందని మానిటర్ లో చూసుకోనని, ఎందుకంటే, తనకు నచ్చడం కన్నా, దర్శకుడికి నచ్చటం ముఖ్యమని, ‘నేను కరెక్టుగా చేశానా? లేదా? అనేది దర్శకుడు చెప్పాలి. మనకు బెటర్ అనిపించవచ్చు, లేదా బ్యాడ్ అనిపించవచ్చు... కానీ, దర్శకుడే ఫైనల్’ అని సందీప్ కిషన్ చెప్పాడు.