: 'జ్యోతుల టీమ్' రాకను వ్యతిరేకిస్తున్న వారితో లోకేశ్ ప్రత్యేక సమావేశం
వైకాపా నేత జ్యోతుల నెహ్రూ తన అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారన్న ఊహాగానాలు మిన్నంటుతున్న వేళ, తూర్పు గోదావరి జిల్లా నేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు పలువురు తెలుగుదేశం ముఖ్య నేతలను పిలిపించుకుని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చిస్తున్నారు. జ్యోతుల టీమ్ రాకతో పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఇబ్బందులు వుండవని, పార్టీ పటిష్టత కోసం తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి వుండాలని ఈ సందర్భంగా లోకేశ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకం పైనా వీరు చర్చించుకున్నట్టు సమాచారం.