: అది దేవుడి దగ్గర ఉంచిన నిమ్మకాయ... ధర రూ. 39 వేలు!


మీరు చదివింది నిజమే. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో దేవుడి దగ్గర ఉంచి పూజలు జరిపిన ఓ నిమ్మకాయను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడటంతో, దాని ధర రూ. 39 వేలు పలికింది. తిరువనై నల్లూరులోని బాలాదండాయుధపాణి ఆలయంలో 11 రోజుల ప్రత్యేక పూజలు జరుగగా, ఇక్కడ దేవుని వద్ద ఉంచిన నిమ్మకాయ రసం తాగితే, సంతానం లేనివారికి పిల్లలు పుడతారని భక్తులు నమ్ముతుంటారు. మొత్తం 9 నిమ్మకాయలకు ఇక్కడ పూజలు జరుగగా, మిగతా ఎనిమిదీ కూడా మంచి ధరలకు అమ్ముడు కావడం విశేషం. పిల్లలు లేని జయరామన్, అమరావతి దంపతులు తొలి నిమ్మకాయను సొంతం చేసుకోగా, నిమ్మకాయల అమ్మకంతో రూ. 57,722 ఆదాయం లభించిందని దేవాలయ కమిటీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News