: జపాన్, సౌత్ కొరియాల చేతుల్లో అణ్వాయుధాలతో అమెరికాకు ప్రమాదం: ట్రంప్


జపాన్, సౌత్ కొరియాల వద్ద సొంత అణ్వాయుధాలున్నాయని, వాటితో ఏనాటికైనా అమెరికాకు ప్రమాదమేనని రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడతాడని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే, తన విదేశాంగ విధానం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉత్తర కొరియా ఇప్పటికే తన దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోందని, దక్షిణ కొరియా, జపాన్ లు సైతం అణ్వాయుధాలు సమకూర్చుకున్నాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా పనిచేసేందుకు తమ సైన్యాన్ని పంపేవరకూ సౌదీ అరేబియా నుంచి ముడి చమురును కొనుగోలు చేయరాదని 'న్యూయార్క్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ప్రపంచమంతటికీ పోలీసులా అమెరికా వ్యవహరించాలనుకోవడం లేదని అన్నారు. ఇదే సమయంలో అమెరికాకు ముప్పు కలుగుతుందంటే, ఎంతకైనా వెళ్తామని అన్నారు.

  • Loading...

More Telugu News