: సినిమాలో ఫుల్ కామెడీ... అందుకే, షూటింగ్ ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తైందో కూడా తెలియలేదు: హేబా పటేల్


'ఆడో రకం ఈడో రకం' సినిమాలో వున్న కామెడీ సీన్ల వల్ల ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమైందో, ఎప్పుడు పూర్తైందో కూడా తెలియలేదని ఈ సినిమా కథానాయిక, 'కుమారి 21 ఎఫ్' ఫేం హేబా పటేల్ తెలిపింది. హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగిన ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, దర్శకుడు నాగేశ్వర్ రెడ్డికి తీసే సన్నివేశం మీద పూర్తి అవగాహన ఉందని చెప్పింది. ఆయన అలా తీయబట్టే ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకులు బాగా ఆదరించారని తెలిపింది. సినిమాలో అద్భుతమైన కామెడీ ఉందని, అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News