: సెట్లో విష్ణు చేసిన అల్లరి చూశాను!: సుశాంత్
హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్ లో మంచు మనోజ్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆడో రకం...ఈడో రకం' సినిమా ఆడియో వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆడియో వేడుకలో నటుడు సుశాంత్ మాట్లాడుతూ, ఓ రోజు ఈ సినిమా షూటింగ్ సెట్ కు వెళ్లానని...అక్కడ మంచు విష్ణు దర్శకుడు నాగేశ్వరరెడ్డిని ఆటపట్టిస్తూ కనిపించాడని అన్నాడు. దర్శకుడినే విష్ణు ఆటపట్టిస్తున్నాడని అనుకుంటే, అందరూ ఒకర్నిమించి మరొకరు ఆటపట్టించుకుంటున్నారని చెప్పాడు. ఇది తాజా జానర్ కామెడీ సినిమా అని చెప్పిన సుశాంత్, అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సినిమాలో ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్నాయని చెప్పాడు.