: నల్గొండ జిల్లాలో దారుణం...యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం బండ్లగూడెంలో దారుణం చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన యువతిని ప్రేమిస్తున్నానంటూ వరంగల్ జిల్లాకు చెందిన సాగ రాజ్ కుమార్ ప్రతిపాదించాడు. అతని ప్రతిపాదనను ఆ యువతి అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రాజ్ కుమార్ బ్లేడుతో ఆ యువతి గొంతు కోశాడు. యువతి కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమెను నల్గొండ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.