: కామెంట్‌ చేయడం మానండి... ఎవరి విషయాలు వారు చూసుకోండి!: స్నాప్‌డీల్ సీఈవో


పాప్యులారిటీని పెంచుకోవ‌డానికి, ప‌బ్లిసిటీ చేసుకోవ‌డానికి, సంతోషాన్ని వ్య‌క్తం చేయ‌డానికి, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డానికి అన్నిటికీ సామాజిక మాధ్యమాలే వేదిక‌లుగా మారుతున్నాయి. తాజాగా ప్ర‌ముఖ సామాజిక వెబ్‌సైట్‌ ట్విటర్‌ వేదికగా ఆన్‌లైన్‌ దిగ్గజ సంస్థలు స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్ ల‌ సీఈవోలు వాగ్వివాదానికి దిగారు. స్వ‌యంగా సీఈవోలే హాట్ హాట్ కామెంట్స్ చేసుకోవ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. చైనా ఆన్‌లైన్‌ దిగ్గజ సంస్థ అలీబాబా నేరుగా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్న నేప‌థ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ సంజయ్‌ బన్సాల్‌ స్పందించారు. ‘అలీబాబా భారత్‌లోకి నేరుగా అడుగుపెడుతోందంటే.. ఇక్కడ ఆ సంస్థ పెట్టుబడులు పెట్టిన సంస్థలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో అర్థమవుతుంది’ అని ఆయ‌న‌ ట్వీట్‌ చేశారు. అయితే, అలీబాబాకు స్నాప్‌డీల్‌లో దాదాపు 500 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఉన్న విష‌యం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్ చేసిన కామెంట్‌తో స్నాప్‌డీల్‌ సీఈవో కునాల్‌ బాల్ ఘాటుగా స్పందించారు. 5 బిలియన్‌ డాలర్ల ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ క్యాపిటెల్‌ను మోర్గాన్‌ స్టాన్లీ ముంచేయలేదా..? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, కామెంట్‌ చేయడం మాని.. ఎవరి విషయాలు వారు చూసుకోవాలంటూ ట్విట్ట‌ర్ ద్వారా చురక అంటించారు.

  • Loading...

More Telugu News