: శాసనసభ స్పీకర్ గా కార్యకలాపాలు నిర్వ‌హించిన గీతారెడ్డి


తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్ ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డి కాసేపు విరామం తీసుకున్న సందర్భంగా ఆమె స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి ప్యానెల్ స్పీకర్ గా కార్యకలాపాలు నిర్వహించారు. శాసన సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లతో పాటు ఏడుగురు ప్యానెల్ స్పీకర్లు ఉంటారు. వీళ్లని అధికార పక్షం, ప్రతిపక్షాల నుంచి ఎన్నుకుంటారు. అందులో భాగంగానే ఆ అవకాశం సీనియర్ కాంగ్రెస్ లీడర్ గీతారెడ్డికి లభించింది. స్పీకర్ మధుసూదనాచారి అనారోగ్య కారణాలతో ఈరోజు స‌భ‌లో అందుబాటులో లేని విష‌యం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి శాసనసభ ప్యానెల్ స్పీకర్ గా కొద్ది సేపు కార్య‌కలాపాలు నిర్వ‌హించారు.

  • Loading...

More Telugu News