: సామర్థ్యం మేరకు ఆడితే ఆసీస్ చిత్తే: కోహ్లీ
టీమిండియా సామర్థ్యం మేరకు ఆడితే ఆసీస్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ఇంతవరకు సామర్థ్యం మేరకు రాణించలేదని, టీమిండియా ఆటగాళ్లంతా సమష్టిగా రాణిస్తే ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఏమాత్రం కష్టం కాదని చెప్పాడు. ఆసీస్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతారని చెప్పాడు. బౌలింగ్ లో వారిని కట్టడి చేసి, బ్యాటింగ్ లో సత్తాచాటితే టీమిండియా విజయం సాధిస్తుందని చెప్పాడు. టీ20 ఫార్మాట్ లో నిలకడగా రాణించడం అంత సులభం కాదని చెప్పాడు. కానీ టీమిండియా కెప్టెన్ ధోనీ దీనికి మినహాయింపని చెప్పాడు. ధోనీ చాలా కూల్ గా వ్యూహాలు రచించి, అమలు చేస్తాడని, అదే ధోనీ బలమని కోహ్లీ తెలిపాడు. తన ప్రదర్శన ఎప్పట్లానే ఉంటుందని, ఆస్ట్రేలియాపై వారిలా దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తానని కోహ్లీ తెలిపాడు.