: మీడియాపై ట్వీట్లు ఎక్కుపెట్టిన నవదీప్


టాలీవుడ్ నటుడు నవదీప్ మీడియాపై ట్వీట్లు వదులుతున్నాడు. తన కుటుంబంతో కలసి చేసుకుంటున్న గృహప్రవేశ కార్యక్రమాన్ని మీడియా రేవ్ పార్టీ చేసేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం తనను అడగకుండా వీడు రాశాడని వాడు, వాడు రాశాడని ఇంకొకడు ఇలా ఎవరు పడితే వారు, ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాసి ప్రసారం చేసేశారని మండిపడ్డాడు. ఇదేమి జర్నలిజం? అంటూ మీడియాను నిలదీశాడు. "నేను దేశానికి పనికిరానని మీ ఫీలింగ్...అలాంటప్పుడు నన్ను పక్కనపడేయొచ్చుకదా? నా పేరు పట్టుకుని ఎందుకు రచ్చ చేయడం?" అని అడిగాడు. పెద్దలు, కుటుంబసభ్యులతో చేసుకున్న వేడుకను రేవ్ పార్టీ చేసిన మహానుభావులందరికీ పాదాభివందనాలని ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News