: 14 ఏళ్ల బాలికను చంపిన కేసులో లొంగిపోయిన ప్రేమోన్మాది
పశ్చిమ బెంగాల్‌లో తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో 14ఏళ్ల బాలికను చంపేసిన ఉన్మాది పోలీసులకి లొంగిపోయాడు. 18ఏళ్లు కూడా నిండని రాజా.. స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న సంగీతా ఎయిచ్‌ను.. శుక్రవారం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిందితుడు రాజా ఈ రోజు పోలీసులకి లొంగిపోయాడు.