: హెచ్చార్సీ ముందు విచారణకు హెచ్ సీయూ వీసీ అప్పారావు
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసి వివాదానికి కేంద్ర బిందువైన వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ పొదిలె అప్పారావు ఎట్టకేలకు మానవ హక్కుల కమిషన్ ముందు విచారణకు హాజరుకాక తప్పలేదు. సుదీర్ఘ సెలవు తర్వాత మొన్న వర్సిటీకి వచ్చిన అప్పారావు ఇన్ చార్జీ వీసీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ధ్వంస రచనకు పాల్పడ్డారు. ఈ కారణంగా వర్సిటీకి సెలవులు ప్రకటించిన అప్పారావు.. వర్సిటీ హాస్టళ్లను మూసివేయించారు. దీనిపై ఆప్ నేత విశ్వేశ్వరరావు హెచ్చార్సీని ఆశ్రయించారు. దీంతో ఈ నెల 26 (నేడు) జరగనున్న విచారణకు తమ ముందు హాజరుకావాలని హెచ్చార్సీ అప్పారావుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దసేపటి క్రితం హెచ్చార్సీకి వెళ్లిన అప్పారావు కమిషన్ ముందు వివరణ ఇచ్చారు.