: వర్సిటీల్లో ఆందోళనలు విచారకరం... ఎమ్మెల్యే సంపత్ కారుపై దాడి బాధాకరం: కేసీఆర్


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్టకేలకు స్పందించారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చకు అనుమతించాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హెచ్ సీయూలో తన కారుపై జరిగిన దాడిపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కేసీఆర్... వర్సీటీల్లో చోటుచేసుకుంటున్న ఆందోళనలు విచారకరమన్నారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్ కారుపై జరిగిన దాడి బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ విషయంపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించిన కేసీఆర్, ఏదైనా చర్చలోనే సభ్యులు తమ వాదనలు వినిపించాలని సూచించారు.

  • Loading...

More Telugu News