: నల్ల బ్యాడ్జీలతో స‌భ‌లోకి కాంగ్రెస్‌.. వాయిదా తీర్మానాలపై చర్చకు ప‌ట్టు!


తెలంగాణ శాసనసభలో వాయిదా తీర్మానాలపై చర్చ జరగాలని కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లిన కాంగ్రెస్‌ సభ్యులు సంపత్‌, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబడ్డారు. హెచ్ సీయూలో ఎమ్మెల్యే సంపత్‌పై జరిగిన దాడికి నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. వాయిదా తీర్మానాలపై సభలో చర్చించాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబడ్డారు. కాంగ్రెస్‌ సభ్యుల నిరసనల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ 10 నిమిషాల పాటు వాయిదా పడి, అనంత‌రం మ‌ళ్లీ ప్రారంభ‌మైంది.

  • Loading...

More Telugu News