: అఫ్జల్ ఉరితీతపై ఒమర్ అబ్దుల్లా మండిపాటు
అందరూ ఊహించినట్టుగానే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఆవేశపూరితమైన గళం విప్పారు. అఫ్జల్ గురు ఉరితీతపై ఆదివారం ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో మండిపడ్డారు. అఫ్జల్ కు మరణశిక్ష అమలు చేసే ముందు అతనిని కుటుంబ సభ్యులను కలవనీయకపోవడం ఓ పెద్ద విషాదమని ఒమర్ వ్యాఖ్యానించారు. కనీసం అతని మృతదేహాన్ని చూసే అవకాశం కూడా కల్పించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఈ సంఘటనతో సమాధానాలు చెప్పవలసిన ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి కామెంట్ చేశారు.