: వచ్చే నెల నుంచి ‘మీ ఇంటికి మీ రేషన్’: ఏపీ మంత్రి పరిటాల సునీత


మంచానికి పరిమితమైన రేషన్ లబ్ధిదారుల కోసం ‘మీ ఇంటికి మీ రేషన్’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఏపీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురంలోని మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రేషన్ దుకాణాలకు రాలేని వారి కోసం ‘మీ ఇంటికి మీ రేషన్’ ద్వారా సదరు లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి సరుకులు అందజేస్తారని చెప్పారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి ‘మీ ఇంటికి మీ రేషన్’ అమల్లోకి వస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రతి రేషన్ దుకాణంలోనూ బియ్యం, చక్కెర, గోధుమ పిండి, కిరోసిన్, తప్పనిసరిగా పంపిణీ చేయాలని ఆమె ఆదేశించారు. ప్రతి నెలా 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందివ్వాలన్నారు. ఒకవేళ, ఆ తేదీలోపు కూడా లబ్ధిదారులు రాలేకపోతే కనుక, మరో రెండు రోజులు సరుకులు అందించాలన్నారు.

  • Loading...

More Telugu News