: ఐఎస్ఐఎస్ లో నంబర్-2 కమాండర్ ను మట్టుబెట్టాం: అమెరికా
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో నంబర్ -2 కమాండర్ అబ్దుల్ రెహ్మాన్ ముస్తఫా అల్ కాద్లీ అలియాస్ హాజీ ఇమాన్ ను మట్టుబెట్టామని అమెరికా దళాలు వెల్లడించాయి. సిరియాలో జరిగిన దాడిలో అతను మరణించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ఆష్ కార్టర్ తెలిపారు. సిరియాలో ఈ నెలలో జరిపిన దాడిలో అబ్దుల్ రహ్మన్ చనిపోయినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. కాగా, హాజీ ఇమాన్ పై అమెరికా ఏడు మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే.