: రాయల్టీకి మరోపేరు బాబాయ్: తారకరత్న
'రాజా చెయ్యివేస్తే' ఆడియో వేడుకలో ఒక వైపు మావయ్య చంద్రబాబునాయుడు గారు, మరోవైపు రాయల్టీకి మరోపేరు బాలయ్య బాబాయ్ ఉన్నారని సినీ నటుడు తారకరత్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న ఈ సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినిమా కోసం యూనిట్ మొత్తం చాలా కష్టపడి పనిచేశామని చెప్పాడు. ఈ సినిమాలో వినోదానికి కావాల్సిన అన్ని హంగులూ ఉన్నాయని చెప్పాడు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని తారకరత్న చెప్పాడు. ఆడియో వేడుకకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.