: అభిమాని ఇంటికెళ్లిన అల్లు అర్జున్
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ మెగాస్టార్ సీనియర్ అభిమానిని ఆనందంలో ముంచెత్తారు. భారీ స్థాయిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన అభిమాని ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా మెగా అభిమాని కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సందర్భంగా అభిమాని ఇంట్లో కేక్ కట్ చేసిన అల్లు అర్జున్, ఆయనకు స్వయంగా తినిపించారు. దీంతో వారి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. స్టైలిష్ స్టార్ తమ ప్రాంతంలోకి రావడంతో ఆ సమీపంలో మెగా అభిమానులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.