: మేకిన్ ఇండియా నినాదాన్ని ఎగతాళి చేయొద్దు: నిర్మలా సీతారామన్


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ఎగతాళి చేయవద్దని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూచించారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, మేకిన్ ఇండియాను ఎగతాళి చేసే కంటే వాస్తవిక వాదనలను తమ ముందుకు తీసుకురావాలని అన్నారు. ప్రతి విషయం గురించి ఏదో ఒకటి మాట్లాడడం ఎన్నికల్లో అయితే బాగుంటుంది కానీ, అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఇలాంటి పంథా మంచిది కాదని ఆమె హితవు పలికారు. పార్లమెంటు సభ్యుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి విషయాల్లో అర్థవంతంగా మాట్లాడాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News