: పాకిస్థానీ జేఐటీ బృందానికి వీసా మంజూరు చేసిన భారత్
ఈ ఏడాది జనవరిలో జరిగిన పఠాన్ కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రదాడి ఉదంతంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల పాకిస్థాన్ బృందానికి భారత్ వీసా మంజూరు చేసింది. పాకిస్థానీ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జేఐటీ)కి ఏడు రోజులకుగానూ వీసాలు మంజూరయ్యాయి. ఈ నెల 27న ఈ టీమ్ భారత్ చేరుకుంటుంది. సార్క్ మంత్రుల సమావేశంలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని విదేశాంగ వ్యవహారాల సలహాదారు సత్రాజ్ అజిజ్ తో భేటీ అయిన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థానీ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు వీసాలు మంజూరైనట్లు ప్రకటించారు. ఆరుగురు ఉగ్రవాదులు మూడు రోజులపాటు పఠాన్ కోట్ ఎయిర్‌బేస్ లక్ష్యంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది జైషే మొహ్మద్ ఉగ్రవాదులను భారత్ భావిస్తుండగా, పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్‌బేస్ పైన దాడి చేసింది తామేనంటూ పాకిస్థాన్ ప్రేరేపిత ఐక్య జీహాదీ మండలి దాడుల అనంతరం ప్రకటించింది.