: పోలీసు ప్రియుడిని హతమార్చిన మహిళకు జీవిత ఖైదు!


పోలీసు ప్రియుడిని హతమార్చిన కేసులో ప్రియురాలికి జీవిత ఖైదు విధిస్తూ తమిళనాడులోని న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఈ కేసు విచారణ చిదంబరం జిల్లా అదనపు బెంచ్ న్యాయస్థానంలో జరిగింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు... విల్లుపురం జిల్లా ఉళుందూరు పేటకు చెందిన గణేశన్(32) 2011లో కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేసేవాడు. ఒక కేసు వ్యవహారమై కలైమణి అను, అతని భార్య వనిత (25) ఈ పోలీస్ స్టేషన్ కు తరచుగా వెళుతుండేవారు. ఈ క్రమంలో గణేశన్, వనితల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్తకు విడాకులిచ్చి గణేశన్ ను పెళ్లి చేసుకోవాలని వనిత నిర్ణయించుకుంది. కానీ, గణేశన్ అందుకు ఒప్పుకోలేదు. 2014లో తన తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాన్ని గణేశన్ చేసుకోవడంతో, తనను కూడా పెళ్లి చేసుకోవాలని అనిత అతన్ని కోరడం జరిగింది. ఈ క్రమంలో అతనిపై ఒత్తిడి తెచ్చింది. అయినప్పటికీ, గణేశన్ అంగీకరించలేదు. దీంతో, అన్నామలైనగర్ లో ఉన్నగణేశన్ ఇంటికి వెళ్లిన వనిత 2014 జూలై 21న అతన్ని కత్తితో పొడిచి హత్య చేసింది. కాగా, ఈ కేసు విచారణ అనంతరం వనితకు యావజ్జీవ శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి క్రిస్టోఫర్ తన తీర్పులో పేర్కొన్నారు. అనంతరం వేలూరు జైలుకు ఆమెను తరలించారు.

  • Loading...

More Telugu News