: పెళ్లిలో బాండ్, డీజేయింగ్ వద్దు...ముస్లిం మతపెద్దల సూచన
పెళ్లన్నాక గానాబజానాలు సర్వసాధారణం. తమ తాహతును బట్టి నిర్వహించే ఊరేగింపుల్లో బ్యాండ్ తో పాటు డీజేయింగ్ కూడా పెట్టుకోవడం ఈవేళ కామన్ అయిపోయింది. అయితే, ఇవి పేదలకు భారంగా మారాయని భావించిన, రాజస్థాన్ లోని ముస్లిం మతపెద్దలు వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వివాహ మహోత్సవాల్లో ఆడంబరాలు తమ మత సంప్రదాయంలో లేవని చెప్పిన వారు వాటిని ఏర్పాటు చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇకపై నిర్వహించే వివాహాల్లో బ్యాండ్లు, డీజేలు లేకుండా చూసుకోవాలని రాజస్థాన్ లోని కోటాకు చెందిన ముస్లిం మతపెద్దలు సూచించారు. బ్యాండు, డీజే వంటి సంప్రదాయలు పేద ముస్లింలకు భారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. పెద్దపెద్ద మ్యూజిక్ పెట్టడం వల్ల ఇతరులకు కూడా ఇబ్బందిగా ఉంటుందని వారు తెలిపారు. అందుకే ఇకపై ఇలాంటివి లేకుండా వివాహం చేసుకోవాలని వారు సూచించారు. అలా కాకుండా మ్యూజిక్, డీజేలతో నిఖా చేసుకోవాలని భావిస్తే వారికి నిఖా ఫాంలు ఇవ్వబోమని వారు స్పష్టం చేశారు.