: తిరిగి కొట్టేందుకు కూడా మేము సిద్ధమే!: సీపీఐ నారాయణ
ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో వామపక్షాలు పైచేయి సాధిస్తాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. విజయవాడలో విలేకరులతో ఈరోజు ఆయన మాట్లాడారు. వామపక్షాలు తమకు ప్రధాన శత్రువుగా తయారవుతున్నాయనే అక్కసుతోనే అధికారపక్షపార్టీ తమ నేతలపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. దెబ్బలు తినడమే కాదు, తిరిగి కొట్టేందుకు కూడా తాము సిద్ధమని ఆయన హెచ్చరించారు. తమిళనాడులో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పేరుతో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేశామని, పశ్చిమబెంగాల్ లో కూడా ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ సందర్భంగా జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్, నవ్యాంధ్ర రాజధాని అమరావతి, హెచ్సీయూ వీసీ అప్పారావు, ఇసుక విధానంలో ఎమ్మెల్యేల అక్రమ సంపాదన మొదలైన విషయాలపై నారాయణ మాట్లాడారు.