: మూడు వికెట్లు తీసిన పాకిస్థాన్...రన్ రేట్ పడిపోకుండా చూసుకుంటున్న ఆసీస్


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య మొహాలీ వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (21) ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించాడు. అమిర్ బౌలింగ్ ను అద్భుతంగా ఎదుర్కొన్న ఖ్వాజా...వాహబ్ రియాజ్ వేసిన లైన్ అండ్ లెంగ్త్ బంతుల్ని ఎదుర్కొనేందుకు మాత్రం ఇబ్బందిపడ్డాడు. దాంతో ఓ అద్భుతమైన బంతికి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (14) ఆచితూచి ఆడుతూ ఇమాద్ వసీం వేసిన స్పిన్ బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బందిపడి పెవిలియన్ చేరాడు. అంతకు ముందే డేవిడ్ వార్నర్ (9) ను మరో అద్భుతమైన బంతితో వాహబ్ రియాజ్ అవుట్ చేశాడు. దీంతో క్రీజులో స్టీవ్ స్మిత్ (15) గ్లెన్ మ్యాక్స్ వెల్ (4) క్రీజులో ఉన్నారు. బౌలర్లను మార్చుతూ కీలక సమయాల్లో వికెట్లు తీసి పాక్ ఆకట్టుకోగా, వికెట్లు పడుతున్నప్పటికీ రన్ రేట్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటూ ఆసీస్ ఆకట్టుకుంటోంది. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News