: వచ్చే నెల 4న టీ-సర్కార్ ఐటీ పాలసీ ఆవిష్కరణ
వచ్చే నెల 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ఐటీ పాలసీని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఈ పాలసీని ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఈ పాలసీలో ఐటీ, గేమింగ్ అండ్ యానిమేషన్, స్టార్టప్ ల పాలసీలు ఉన్నాయి. కాగా, ఐటీ కంపెనీలకు రాయితీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.