: ఛాయ్ తాగి, దమ్ముకొట్టి హల్‌చల్ చేసిన ఆనం వివేకానందరెడ్డి
నెల్లూరులో టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి స్థానిక ప్రజలకు 'సూపర్ సీన్' చూపించారు. ఓ టీ స్టాల్ వద్ద ఛాయ్ తాగుతూ, దమ్ముకొట్టి హుషారుగా గడిపారు. నెల్లూరు సెయింట్ ఆంథోని చర్చ్‌లో శిలువ మోసేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. అయితే శిలువను బయటకు తీసేందుకు కొంత సమయం పట్టింది. ఆ సమయంలో టైమ్ వేస్ట్ చేయడం ఎందుకనుకున్నారో ఏమో, సాదాసీదా వ్యక్తిలా బయటకు వచ్చి ఛాయ్, సిగరేట్ తాగి కాసేపు అక్కడ గడిపారు.