: ఏసు వేషధారణలో శిలువ మోసిన ఆనం వివేకానందరెడ్డి
నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానందరెడ్డి శిలువను మోసి ఏసుక్రీస్తుపై తన భక్తిని చాటుకున్నారు. నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఫతేఖాన్ పేటలోని పునీత్ ఆంథోనీ చర్చ్ కి ఏసుక్రీస్తు వేషధారణలో వచ్చిన ఆనం, ప్రత్యేక ప్రార్థనల అనంతరం శిలువను భుజానికి ఎత్తుకుని వీధుల్లో నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు సర్వమతాలూ ఒక్కటేనని అన్నారు. గత 17 సంవత్సరాలుగా ఇదే చర్చి వద్ద తాను శిలువను మోస్తున్నానని, అనుకున్నది, కోరుకున్నది ప్రభువు చేస్తున్నాడని, తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ప్రజలందరూ ఆనందంగా గడపాలని ప్రభువును కోరినట్టు వివరించారు.