: ఇంటర్నెట్ వేగంలో సరికొత్త రికార్డు... సెకనుకు 1.59 గిగాబైట్లు!
మారుతున్న కాలానికి, అందివస్తున్న అధునాతన టెక్నాలజీ ఇంటర్నెట్ వేగాన్ని గణనీయంగా పెంచేసింది. యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టాల్, యూనివర్శిటీ ఆఫ్ లూండ్ కు చెందిన విద్యార్థులు సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో భాగంగా 20 మెగాహెర్జ్ రేడియో చానల్ పై ఇంటర్నెట్ వేగంలో సరికొత్త రికార్డును నమోదు చేశారు. వీరి రీసెర్చ్ లో సెకనుకు 1.59 గిగాబైట్ల వేగం నమోదుకావడం విశేషం. ప్రస్తుతం ఉన్న 4జీ సెల్యులార్ టెక్నాలజీ వేగంతో పోలిస్తే ఇది 12 రెట్లు అధికం. చాలా వైఫై రూటర్లు, 4జీ సెల్ ఫోన్ వ్యవస్థల్లో వాడే మిమో (మల్టిపుల్ యాంటెన్నా టెక్నాలజీ)ని వాడి తాము ఈ వేగాన్ని సాధించినట్టు రీసెర్చర్లు వెల్లడించారు.