: చిన్నప్పటి నుంచి ఇండియా అంటే కోపం, కసి: విచారణలో హెడ్లీ
తనకు చిన్నప్పటి నుంచి ఇండియా అంటేనే కోపం, కసి పెల్లుబికేవని ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు డేవిడ్ హెడ్లీ వ్యాఖ్యానించాడు. మూడవ రోజు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెడ్లీ విచారణ జరుగుతుండగా, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 1971లో తాను చదువుతున్న స్కూలుపై భారత్ బాంబు దాడి చేసిందని తెలిపాడు. అప్పటి నుంచి ఇండియా అంటే ద్వేషమని, ఆ దేశానికి వీలైనంత ఎక్కువ నష్టం కలిగించడమే తమ లక్ష్యమని అన్నాడు. తన పగ, ప్రతీకారాలను తీర్చుకునేందుకే లష్కరే తోయిబాలో చేరినట్టు వెల్లడించాడు.