: నెల్లూరుకు రాని నరసింహస్వామి... రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి!


నెల్లూరులో పెన్నా నది ఒడ్డున ఉన్న రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా దాదాపు 12 కిలోమీటర్ల దూరంలోని కొండపై ఉన్న నరసింహస్వామిని తెచ్చి నగరంలో ఊరేగించడం దశాబ్దాల సంప్రదాయంగా కొనసాగుతుండగా, నేటి ఉదయం స్వామివారి విగ్రహం జొన్నవాడ సమీపంలో నేల జారింది. దీంతో భక్తులు, పూజారులు స్వామివారి విగ్రహాన్ని నెల్లూరుకు తీసుకురాకుండానే తిరిగి కొండపైకి చేర్చారు. స్వామివారి రాకకోసం వేచిచూస్తున్న వేలాది మంది ఏదో అనర్ధం జరగనుందని ఆందోళన చెందుతున్నారు. నేడు జరగనున్న రథోత్సవంలో నరసింహుడు పాల్గొనడం లేదని రంగనాథస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News